తెలంగాణ బీజేపీకి షాక్.. పోటీకి అభ్యర్థులు దొరకలేదు..!

Saturday, January 11th, 2020, 09:35:10 PM IST

తెలంగాణలో ఈ నెల 22వ తేదిన మున్సిపల్ ఎన్నికలు జరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ ఎన్నికలకు నామినేషన్ల గడువు కూడా పూర్తయ్యింది. అయితే నామినేషన్లు ముగిసిన అనంతరం బీజేపీకి షాకింగ్ వార్త తెలిసింది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్‌కి తామే పోటీ అని చెప్పుకుంటున్న బీజేపీకి కనీసం మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకలేదట.

అయితే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మొత్తం 2727 వార్డులకు నిన్న నామినేషన్ల గడువు ముగిసిపోగా దాదాపు 30 శాతం స్థానాలలో బీజేపీ తరుపున అభ్యర్థులు నామినేషన్లు వేయలేదట. నేడు పార్టీ కార్యాలయానికి వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు బీజేపీకి కాస్త పట్టు ఉన్న స్థానాలైనటువంటి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాలలో కూడా కొన్ని వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంపై ఆయా ఇంఛార్జ్‌లపై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఏది ఏమైనా ఎన్నికల ముందే బీజేపీకి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయంటే ఇక ఫలితాలు ఎలా ఉంటాయో పెద్దగా చెప్పనక్కర్లేదు.