దుబ్బాకలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముందు నుంచి తనకు టికెట్ ఖచ్చితంగా వస్తుందని భావించిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ మళ్ళీ మొండిచేయి చూపింది. టీఆర్ఎస్ తరుపున సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకే టికెట్ కట్టబెట్టడంతో చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు.
అయితే కాంగ్రెస్ పార్టీ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్‌లో కూడా లొల్లి షురూ అయ్యింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరపున టికెట్ ఆశించి భంగపడ్డ ఇద్దరు నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. సీనియర్ నేత నర్సింహారెడ్డి, మనోహర్‌రావులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.