ఎంపీ విజయసాయి రెడ్డికి బిగ్ రిలీఫ్.. రాష్ట్రపతి కీలక నిర్ణయం..!

Tuesday, September 8th, 2020, 07:28:02 AM IST


వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై అనర్హత వేటు వేయాలన్న పిటీషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొట్టేశారు. అయితే కేబినెట్ ర్యాంక్ స్థాయిలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా లాభాదాయక పదవిలో ఉన్నారని బీజేపీ నేత రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

అయితే లాభదాయక పదవులు కలిగి ఉన్నందున రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ వేసి, ఎన్నికల కమీషన్ అభిప్రాయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎలాంటి జీతభత్యాలు తీసుకోకపోవడంతో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద పరిగణించలేమని ఎన్నికల కమీషన్ వెల్లడించింది. దీనికి ప్రిపెన్షన్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ యాక్ట్ వర్తించదని తెలిపింది. ఈసీ అభిప్రాయం మేరకు అనర్హత పిటిషన్‌ను కొట్టేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.