బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట..!

Wednesday, February 10th, 2021, 05:00:23 PM IST

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఐదేళ్ల క్రితం బీఫ్‌ ఫెస్టివల్‌ ఘటనలో ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి స్పెషల్‌ కోర్టు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది పాటు జైలు శిక్షను విధించింది. దీనిపై రాజాసింగ్ వెంటనే బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా వాదనలు విన్న కోర్టు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే దీనిపై నెలరోజుల్లో హైకోర్టులో తేల్చుకోవాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పును రాజాసింగ్ హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రజా ప్రతినిదుల కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే రాజాసింగ్ అప్పీల్ పై తదుపరి విచారణను నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.