బిగ్ మిరాకిల్.. అదృష్టం అంటే ఇతగాడిదేనండోయ్..!

Thursday, September 17th, 2020, 12:57:08 PM IST

ఓ వ్యక్తి చావు అంచుల దాకా వెళ్ళి సేఫ్‌గా బయటపడ్డాడు. ఎలా అనుకుంటున్నారా బైక్‌పై నుంచి ఓ వ్యక్తి ఓ జంక్షన్ దగ్గర టర్న్ తీసుకుంటున్నాడు. అయితే అతడి పక్కనే ఓ పెద్ద లారీ ట్యాంకర్ కూడా టర్న్ తీసుకుంటుంది. అయితే ట్యాంకర్‌ని ఓవర్‌టేక్ చేసే సమయంలో ఆ వ్యక్తి బైక్ స్కిడ్ అవ్వడంతో నేరుగా ఆ ట్యాంకర్ కిందకు పడిపోయాడు. అయితే ముందు టైర్లు తప్పిపోయినా వెనక టైర్లు ఖచ్చితంగా ఎక్కేస్తాయి అనుకున్నా ఏదో మిరాకిల్ జరిగినట్టు క్షణాల్లో అతగాడు బయటపడ్డాడు. అయితే ఇది చూసిన వారంతా అదృష్టం అంటే ఇతడిదే అని అంటున్నారు.

అయితే ఈ వీడియోను హైదరాబాద్ కమీషనర్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ జంక్షన్ల దగ్గర ఓవర్‌టేకింగ్ చేయడం వలన చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నారు. జీవితం చాలా విలువైనదని రోడ్లపై వెళ్ళేటప్పుడు తొందరపాటు ఉండకూడదని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు.