బ్రేకింగ్: పుణె సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్ని ప్రమాదం..!

Thursday, January 21st, 2021, 03:40:36 PM IST

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారు చేస్తున్న పుణె సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లోని టెర్మినల్ గేట్-1 దగ్గర భారీగా మంటలు చెలరేగాయి. దీంతో రెండో అంతస్తులో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే దాదాపు 10 ఫైరింజన్లు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో ఉన్నాయి. అయితే అసలు మంటలు ఎలా సంభవించాయి అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉంటే కరోనాకు కోవిషీల్డ్ తయారు చేస్తున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపుతుంది. అయితే నిర్మాణంలో ఉన్న యూనిట్‌లో మంటలు చెలరేగాయని, వ్యాక్సిన్ స్టోరెజ్ యూనిట్ భద్రంగా ఉందని, వ్యాక్సిన్ తయారీకి ఎలాంటి అంతరాయం లేదని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చెప్పుకొస్తుంది.