అరవై ఏళ్లు దాటిన వారికి వాక్సిన్ ఫ్రీ – కేంద్ర ప్రభుత్వం

Thursday, February 25th, 2021, 12:21:48 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వాక్సిన్ సరఫరా చేస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. అరవై ఏళ్లు దాటిన వారికి వాక్సిన్ ఫ్రీ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక 45 ఏళ్లు దాటి, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వాక్సిన్ ఫ్రీ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీరికి వాక్సిన్ ఫ్రీ. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే వాక్సిన్ ధర చెల్లించి వేయించుకోవాల్సి ఉంటుంది అని, అయితే ప్రభుత్వ ఆసుపత్రి లో అలా ఉండదు అని స్పష్టం చేసింది.

మార్చి ఒకటవ తేదీ నుండి ఈ ఫ్రీ వాక్సిన్ ప్రక్రియ మొదలు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలో నే అతి పెద్ద వాక్సినేషన్ కార్యక్రమం రెండవ దశ సోమవారం నుండి మొదలు కానుంది. అయితే భారత్ లో 60 ఏళ్లకు పైగా ఉన్న వారు పది కోట్ల మందికి పైన ఉన్నారు. వీరి తో పాటుగా 45 ఏళ్లు దాటి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రెండవ విడతలో వాక్సిన్ వేయనున్నారు. అయితే ఈ మొత్తం ప్రక్రియ కోసం పది వేల ప్రభుత్వ ఆసుపత్రులు, 20 వేల ప్రైవేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.