హై అలర్ట్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు..!

Friday, January 29th, 2021, 07:27:04 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకలు జరిగిన సమయంలో భారీ పేలుడు సంభవించింది. బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న విజయ్ చౌక్‌కు కేవలం కిలోమీటర్ దగ్గరలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో బ్లాస్టింగ్ జరిగింది. ఈ పేలుడు ధాటికి అక్కడున్న మూడుకార్లు ధ్వంసం అయ్యాయి. అగ్రిమాపక సిబ్బందితో సహా ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయానికి కేవలం 50 మీటర్ల దూరంలో ఈ బ్లాస్ట్‌ జరగగా, పూల కుండీలో బాంబ్ పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఎవరికి కూడా గాయాలు కాలేదు. అయితే బాంబ్ పేలుడు కంటే ముందుగానే గుర్తు తెలియని అగంతకులు కొందరు పోలీసులకు ఫోస్ చేసి పేలుడు జరుగుతుందని హెచ్చరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ పేలుడుకి ఐఈడీ వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే బ్లాస్టింగ్ అనంతరం అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం దేశమంతటా హై అలర్ట్ ప్రకటించింది.