భారతీయుల కి అండగా ఉంటాం – బైడెన్

Tuesday, April 27th, 2021, 07:42:55 AM IST

భారత దేశం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజుకి మూడు లక్షలకి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, రెండు వేలకు పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే ఈ మేరకు భారత్ కి అన్ని విధాల సహకరించేందుకు పలు దేశాలు సన్నాహం అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యం లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బైడెన్ తో మాట్లాడటం జరిగింది అని, అయితే అమెరికా మరియు భారత్ లో వ్యాప్తి చెందుతున్న కరోనా పరిస్థితిని గురించి చర్చించుకున్న విషయాన్ని వెల్లడించారు. అయితే భారత దేశానికి అందిస్తున్న సహాయానికి మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే భారత దేశం మరియు అమెరికా ఆరోగ్య సంరక్షణ భాగస్వామ్యం కరోనా ను అరికట్ట గలదు అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బైడన్ సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తో మాట్లాడిన విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి గల పోరాటం లో అత్యవసర సహాయం మరియు వనరులను అందించడానికి అమెరికా పూర్తి మద్దతు ఉంటుంది అని హామీ ఇచ్చారు. భారత్ మా కోసం ఉందని, భారతీయుల కి అండగా ఉంటామని బైడెన్ చెప్పుకొచ్చారు.