ఆపద లో ఉన్న భారత్ కు సహకారం అందిస్తాం – బైడెన్

Monday, April 26th, 2021, 11:28:18 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే కరోనా తో సతమతమవుతున్న భారత్ కి కావాల్సిన సహకారం అందిస్తాం అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. అదే విధంగా అమెరికా ఉపాధ్యక్షులు కమలా హారిస్ సైతం హామీ ఇచ్చారు. అయితే కరోనా వైరస్ కట్టడి లో ఉపయోగపడే కీలక వైద్య పరికరాలను మరియు ఇతర సరఫరాలను భారత్ కి పంపనున్నాం అని బైడెన్ తెలిపారు. అయితే మొదటి దశ కరోనా విజృంభణ సమయం లో అమెరికా ఆసుపత్రుల పై తీవ్ర ఒత్తిడి నెలకొంది అని, ఆ సమయం లో భారత్ తమకు అండగా నిలబడింది అంటూ బై డెన్ చెప్పుకొచ్చారు.

అయితే అదే రీతిలో ఇప్పుడు ఆపద లో ఉన్నటువంటి భారత్ కి సహకారం అందిస్తామని బై డెన్ చెప్పుకొచ్చారు. అయితే భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఆందోళన కరంగా ఉందని కమలా హారిస్ అన్నారు. అయితే ఈ నేపథ్యం లో కావాల్సిన సహాయం అందించేందుకు భారత్ ప్రభుత్వం తో కలిసి పని చేస్తున్నాం అని వ్యాఖ్యానించారు. అయితే సాయం అందిస్తూనే, హెల్త్ కేర్ వర్కర్ల తో పాటుగా భారత ప్రజల క్షేమం కోసం ప్రార్ధిస్తున్నాం అని చెప్పుకొచ్చారు.