హైదరాబాదీ ఫ్యాన్స్ నాకు చాలా ప్రేమని ఇచ్చారు – భువీ

Wednesday, March 31st, 2021, 12:37:07 PM IST

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ మన దేశం లో నే జరగనుంది. అయితే ఐపియల్ కి రోజులు దగ్గర పడుతున్న కొద్ది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రాంచైజి లు అన్నీ కూడా శిబిరాలను ఏర్పాటు చేశాయి. ఆటగాళ్ళు అందరూ కూడా ఇప్పుడు తమ టీమ్ తో ఉన్నారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏ విషయం అయినా సరే సన్ రైజర్స్ హైదరాబాద్ తనదైన శైలి లో ట్వీట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే ఇప్పుడు భువనేశ్వర్ కి సంబందించిన ఒక పోస్ట్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ పోస్ట్ చేసింది.

హైదరాబాదీ ఫ్యాన్స్ నాకు చాలా ప్రేమని ఇచ్చారు అని, పెర్ఫార్మెన్స్ రూపం లో తిరిగి ఇచ్చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. లేకపోతే లావైపోతా అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ బాబు హీరో గా నటించిన శ్రీమంతుడు సినిమాలోని డైలాగ్ తరహాలో భువి వ్యాఖ్యలు చేయడం తో అందుకు సంబంధించిన ట్వీట్ మరియు పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో భువి తన సత్తా చాటాడు. మరొకసారి కెరీర్ బెస్ట్ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు భువి.