ఆలా చేయకపోతే సీఎంగా వేస్ట్.. భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, September 22nd, 2020, 07:30:31 PM IST

Bhuma-Akhila-Priya

ఏపీలోని దేవాలయలపై జరుగుతున్న వరుస ఘటనలపై స్పందించిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఇంట్లో ఉన్నప్పుడు ఏ దేవుడి నైనా పూజించుకోవచ్చని, ఒక రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు అన్ని కులాలు, మతాలను గౌరవించాలని అలా చేయలేకపోతే సీఎంగా వేస్ట్ అని అన్నారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయని, ఆలయాలపై దాడులు చేసే గ్యాంగ్‌ను ప్రభుత్వం పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దాడులకు పాల్పడే వారిని పట్టుకోలేకపోతే కేంద్రం ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి దాడులపై విచారణ జరిపించాలని కోరారు. దేవాలయాలపై దాడులు ఏ ముఖ్యమంత్రి హయాంలో జరగలేదని దేవుడికే రక్షణ లేకపోతే ప్రజలకు ఏమి రక్షణ కల్పిస్తారని ఎద్దేవా చేశారు. ఇక మంత్రి కొడాలి నాని తిరుపతి డిక్లరేషన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు.