బిగ్ న్యూస్ : ఏపీలో ఆడవారికి రక్షణేది..నిలదీస్తున్న భూమా అఖిలప్రియ.!

Tuesday, August 4th, 2020, 01:59:16 PM IST

Akhila-Priya

గత కొన్నాళ్లు కితం తెలంగాణలో జరిగిన దారుణ ఘటన దిశా ఉదంతం ఎంత సంచలనం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ “దిశా చట్టం” పేరిట మహిళల రక్షణ కొరకు కఠిన శిక్షలు విధిస్తామని తెలిపారు. ఇదే అంశాన్ని అప్పట్లో వైసీపీ మహిళా నేతలు సహా ఇతర నేతలు కూడా ఒక రేంజ్ లో ఎలివేట్ చేస్తూ కితాబిచ్చారు.

కానీ ఇలాంటివి అన్నీ కేవలం ఆర్భాటాలకు తప్ప నిజ జీవితంలో ప్రజలకు ఆడవారికి ఏమాత్రం పనికి రావడం లేదని నిరూపితం అయ్యిపోయింది. ఈ చట్టాన్ని తెచ్చిన కొద్ది లోనే మహిళకు మైనర్ బాలికలపై ఏపీలో ఎన్నో ఉదంతాలు చోటు చేసుకున్నాయి. కానీ ఎక్కడా కూడా వారికి సరైన శిక్షలు పడిన దాఖలాలు వినిపించలేదు. అలా ఇప్పుడు ఏపీలో చోటు చేసుకున్న మరో దారుణ ఘటనపై టీడీపీ మహిళా నేత భూమా అఖిల ప్రియా సంచలన పోస్ట్ ఒకటి పెట్టారు.

ఒక గిరిజన మహిళను నలుగురు ఆగంతకులు ఆమె భర్తను కొట్టి ఆమెను బలాత్కారం చెయ్యడం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏపీలో ఆడవారికి రక్షణ అనేది జోక్ గా మారిందా? దిశా యాక్ట్ ఏమయ్యింది? హోమ్ మినిష్టర్ ఎక్కడ? దిశా పోలీస్ స్టేషన్స్ ఉండి అసలు ఏం లాభం” అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. మరి దీనిపై వైసీ[ నేతలు ఏం సమాధానం చెప్తారో చూడాలి.