దమ్ముంటే నిరూపించండి.. వైసీపీ ఎమ్మెల్యేకి భూమా అఖిలప్రియ సవాల్‌..!

Friday, October 30th, 2020, 10:03:05 PM IST

Bhuma-Akhila-Priya

వైసీపీ ఎమ్మెల్యేకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. ఇటీవల నంద్యాలలో వైసీపీ నేత, న్యాయవాది సుబ్బరాయుడుని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో కర్రలతో కొట్టి ఆయన్ను చంపేశారు. అయితే ఈ కేసులో భూమా అఖిల ప్రియ హస్తం ఉందని ఎమ్మెల్యే శిల్పా రవి ఆరోపణలు చేశారు.

అయితే ఈ ఆరోపణలపై స్పందించిన భూమా అఖిలప్రియ దమ్ముంటే సుబ్బారాయుడు హత్యకేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందని వారం లోపల నిరూపించాలని సవాల్ విసిరారు. అలా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తమపై తప్పుడు కేసులు పెడితే విడిచిపెట్టనని హెచ్చరించారు. నంద్యాల డివిజన్‌లో ఏది జరిగినా భూమా కుటుంబం మీదకే బురద జల్లుతున్నారని ఆమె మండిపడ్డారు. శిల్పా రవి పుట్టక ముందే తన తండ్రి భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు.