భూమా అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..!

Thursday, January 7th, 2021, 01:10:10 AM IST

టీడీపీ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ఎదుట హాజరుపర్చారు. అఖిలప్రియకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించారు. దీంతో ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో ఈనెల 20 వరకు ఆమె రిమాండ్‌లో ఉంటారు.

ఇదిలా ఉంటే అంతకు ముందు అఖిలప్రియను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన సందర్భంలో పెద్ద హైడ్రామా నడిచింది. గాంధీ ఆసుపత్రిలో భూమా అఖిలప్రియ నీరసంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలిసింది. అనంతరం అఖిలప్రియకు ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవని వైద్యులు రిపోర్టు ఇచ్చారు. ఈ తరుణంలో గాంధీ ఆస్పత్రిలో కరెంట్‌ బంద్‌ చేసి మీడియాకు తెలియకుండా అఖిలప్రియను పోలీసులు రహస్యంగా కోర్టుకు తరలించారు.