మూడు రాజధానులు ఎందుకో అందరికి తెలుసు.. భూమా అఖిల ప్రియ కీలక వ్యాఖ్యలు..!

Saturday, October 10th, 2020, 06:40:05 PM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం, ప్రజల సంక్షేమం కోసం భూములిచ్చిన రైతులపై కక్ష్య సాధింపులకు పాల్పడడం ఏమిటని అన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళలు 300 రోజుల నుంచి ధర్నాలు, రాస్తారోకాలు చేపడుతున్న ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని అన్నారు.

అయితే అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని అంటున్నారని, అధికారంలో ఉండి కూడా ఎందుకు దానిని నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. రైతులను రాజులను చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం వారు రోడ్లపైకి వచ్చినా ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. కర్నూల్లో హైకోర్టు పెట్టడం అనేది ప్రభుత్వం చేతిలో లేదని అన్నారు. అసలు విశాఖపై పాలకుల కన్ను ఎందుకు పడిందో అందరికి తెలుసని అన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించాక అక్కడ 72 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు.