సీఎం జగన్ డిసీషన్.. సంతోషించానన్న మాజీ మంత్రి అఖిలప్రియ..!

Thursday, March 25th, 2021, 11:23:54 PM IST


కర్నూల్ జిల్లా ఓర్వకల్లు విమానశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంతోషం వ్యక్తం చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆమె తాను మంత్రిగా ఉన్నప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలకు 75 లక్షల రూపాయలు మంజూరు చేయించానని, కర్నూలులో ఉయ్యాలవాడ నరసింహరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిచేందుకు కృషి చేశానని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే రాయలసీమ పౌరుషానికి ప్రతీక అయిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని, తెల్లదొరల దాష్టీకాన్ని ఎదురించి పోరాడిన తొలితరం యోధుడు ఆయన అని, అలాంటి మహనీయుడి వీరోచిత గాథను తెలుగువారు ఎన్నిటికీ మరిచిపోరని, సుమారు ఏడాదిపాటు ఈస్ట్‌ ఇండియా పాలకులను గడగలాడించాడు. ఆయన పేరును కర్నూలు విమానాశ్రయానికి పెట్టాలని పలువురు ప్రతిపాదించడంతో సీఎం జగన్ ఓర్వకల్లు ఎయిర్ పోర్టును సీఎం జాతికి అంకితం చేశారు.