బుల్లితెర పై సత్తా చాటలేక చతికిలబడిన “భీష్మ”

Thursday, November 5th, 2020, 01:56:30 PM IST

కొన్ని చిత్రాలు థియేటర్లలో ఎంత బాగా ఆడినా, బుల్లితెర పై మాత్రం చూసేందుకు అంతగా ఆసక్తి చూపించరు ప్రేక్షకులు. కొన్ని చిత్రాలను మాత్రం ఇంట్లో చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు ప్రేక్షకులు. అయితే యువ హీరో నితిన్ మరియు రష్మీక మందన్న కలిసి హీరో హీరోయిన్ లుగా నటించిన భీష్మ చిత్రం ధియేటర్ లలో విజయవంతం గా ప్రదర్శించబడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇటీవల జెమిని టీవీ లో అక్టోబర్ 25 న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టేలికాస్ట్ అయింది.

భీష్మ చిత్రం ఆనాడు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, బుల్లితెర పై మాత్రం చతికిలబడింది అని చెప్పాలి. కేవలం 6.65 టీవీఆర్ ను సొంతం చేసుకొని ఘోర మైన ప్రదర్శన ను కనబర్చింది. అయితే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఇంకా ప్రేక్షకులకు అందుబాటులో ఉండటం తో అభిమానులు ముందుగానే అందులో చూసే అవకాశం ఉన్నది. ప్రేక్షకులు ఓటిటి బాట పట్టిన అనంతరం నుండి నెట్ ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియో లలో ఎక్కువగా సినిమాలను చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే భీష్మ చిత్రం తక్కువ టీవీఆర్ ను సొంతం చేసుకోవడం పట్ల అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు.