ప్రజల ప్రాణాలను తెలంగాణ ప్రభుత్వం గాలికొదిలేసింది – భట్టి విక్రమార్క

Tuesday, September 1st, 2020, 07:25:39 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ పెరిగిపోతుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిని సందర్శించిన భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. కరోనా కేసులు పెరిగిపోతున్నా ప్రజలకు సరైన వైద్యం అందించకుండా ప్రభుత్వం గాలికొదిలేసిందని అన్నారు. మంత్రి ఈటల రాజేందర్‌ ఉత్సవ విగ్రహంలా మారారని విమర్శలు గుప్పించారు.

అంతేకాదు కరోనా బారినపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని కానీ సీఎం కేసీఆర్‌ కనీసం దీనిపై సమీక్షలు కూడా నిర్వహించడం లేదని మండిపడ్డారు. 3.50 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం ఆ డబ్బును దేనికి ఖర్చు పెట్టిందో చూపించాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది ఎవరైనా కరోనా సోకి చనిపోతే వారికి తగు నష్ట పరిహారం ఇవ్వాలని అన్నారు.