ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయ్యింది – భట్టి విక్రమార్క

Friday, January 15th, 2021, 06:24:43 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పోరాడి తెలంగాణ సాధించుకుంటే నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు.

అయితే గతంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను పూర్తిగా భర్తీ చేయలేదని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయడంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భట్టి విమర్శలు గుప్పించారు. ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.