కేసీఆర్‌కు అధికారం శాశ్వతం కాదు.. భట్టి విక్రమార్క సీరియస్ కామెంట్స్

Monday, October 5th, 2020, 03:15:16 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చే పనిలో ఉందని, పేదలు రూపాయి రూపాయి పోగేసి కొన్న ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్ చేయమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం క్రమబద్ధీకరించాలి కానీ ఆస్తుల్లో వాటా కొల్లగొట్టడం సబబు కాదని అన్నారు.

అయితే ప్లాటు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ప్రభుత్వం ఫీజు తీసుకుందని అటువంటప్పుడు మళ్ళీ ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు ఎందుకు అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చేందుకు ప్రజలపై ఇష్టమొచ్చినట్టు భారం వేస్తున్నారని అన్నారు. అయితే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, తాము అధికారంలోకి వచ్చాక అందరికి న్యాయం చేస్తామని భట్టి అన్నారు. ఆస్తుల ఆన్‌లైన్ పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఎవరూ ఎల్‌ఆర్‌ఎస్ కట్టవద్దని అన్నారు. ఇకగ్రామాల్లో ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారన్నారని అందరికి తాము అండగా ఉంటామని అన్నారు.