తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ దగా,మోసం చేస్తున్నారు – భట్టి విక్రమార్క

Thursday, September 3rd, 2020, 06:04:52 PM IST

bhatti-vikramarka

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పై, సీఎం కేసీఆర్ తీరు పై ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ దగా, మోసం చేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే పేద ప్రజల కోసం ఏడాది కి బడ్జెట్ లో లక్షా 80 వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్తున్న కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల కోసం ఎంత కేటాయించారు అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆరున్నర ఏళ్లలో ప్రభుత్వం ఒక్క కొత్త ఆసుపత్రి అయిన నిర్మించారా అంటూ సూటిగా నిలదీశారు.

పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు లేకపోవడం, ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోక పోవడం దురదృష్ట కరం అని తెలిపారు. ఇన్నిన్ని ఖాళీలు ఉంటే పేదలకు వైద్యం ఎలా అందుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి అంటూ మరొక డిమాండ్ చేశారు.