తెలంగాణ సాధించింది వ్యాపారం చేయడానికి కాదు – భట్టి విక్రమార్క

Monday, September 21st, 2020, 11:12:33 PM IST


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై మరోమారు కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధి లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తాం అని మంత్రి కేటీఆర్ అన్నారు అని, కానీ తనకు 3,428 ఇళ్లు మాత్రమే చూపించారు అంటూ మరోమారు వ్యాఖ్యానించారు భట్టి విక్రమార్క. అయితే కాగితాల పై ఉన్నటువంటి లెక్కలు క్షేత్ర స్థాయిలో చూపించడం లేదు అని ఆరోపణలు చేశారు. లక్ష ఇళ్లు కట్టలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి తెలియక తనతో ఛాలెంజ్ వేసినట్లు భట్టి విక్రమార్క అన్నారు.

అయితే హైదరాబాద్ లో ప్రభుత్వ భూములను చూపిస్తే ఇళ్లు కట్టిస్తామని అధికార పార్టీ నేతలు అంటున్నారు, కానీ దీని ప్రకారం లక్ష ఇళ్లు కట్టలేదని ఒప్పుకున్నట్లు అంటూ భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ను సాధించింది వ్యాపారం చేయడానికి కాదు అని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. అయితే ఫార్మా పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 7,950 ఎకరాల భూమి తీసుకుంది అని, అయితే ఏ ప్రయోజనాల కోసం తీసుకున్నారు అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాక దీని వెనుక ఎవరూ ఉన్నారు అంటూ నిలదీశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ను దుయ్యబట్టారు భట్టి విక్రమార్క.