సభ లో మాట్లాడేందుకు కాంగ్రెస్ కి కేవలం 6 నిమిషాలే నా!?

Tuesday, September 8th, 2020, 09:59:03 PM IST


తెరాస ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలకు పరిష్కారం లభించేది దేవాలయం లాంటి శాసన సభలో నే అని, కానీ తెరాస ప్రభుత్వం మాత్రం అక్కడ ప్రతి పక్షాల గొంతు నొక్కుతుంది అని ఘాటు విమర్శలు చేశారు. 19 మంది ఎమ్మెల్యే లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లో సీఎం కేసీఆర్ కొందరిని తెరాస లో చేర్చుకున్నారు అని తెలిపారు. అయితే ఆ 19 మంది ప్రాతిపదికన కాకుండా, ఇప్పుడు ఉన్నటువంటి సభ్యుల ప్రకారమే సభ లో సమయం కేటాయిస్తున్నారు అని మండి పడ్డారు.

శాసన సభ లొ మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ కి కేవలం ఆరు నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి సాకుతో మీడియా పాయింట్ ను తాత్కాలికం గా తొలగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం అప్రజాస్వామిక చర్య అని, దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ఆలోచనలను అమలు చేస్తోంది అని, మీడియా పాయింట్ పునరుద్ధరించే విధంగా తెలంగాణ రాష్ట్ర స్పీకర్ తగు చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి అన్నారు.