అప్పులను చూస్తుంటే రాష్ట్రం ఏమైపోతుందా అని భయమేస్తోంది – భట్టి విక్రమార్క

Tuesday, August 25th, 2020, 07:09:22 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు పై విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒక దాని తరువాత మరొక అంశం పై కేసీఆర్ సర్కార్ ను నిలదీస్తూ వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్ పెట్టీ భారీగా రుణాలు తీసుకుంటుంది అని, భారీగా 200 శాతం లోన్లు తీసుకు రావడానికి తెర లేపింది అంటూ కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రుణాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఆర్డినెన్సు జారీ చేశారు అని, అప్పులను చూస్తుంటే రాష్ట్రం ఏమై పోతుందా అని భయమేస్తోంది అని అన్నారు.

అయితే ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబి లోకి వెళ్ళింది అని, ఇప్పటి వరకు 3,18,918 కోట్ల అప్పు చేసిన విషయాన్ని భట్టి విక్రమార్క వెల్లడించారు. అయితే 70 ఏళ్లలో 69 వేల కోట్ల అప్పు ఉంటే 6 ఏళ్లలో మూడు లక్షల రూపాయల కోట్లు అప్పు చేశారు అని అన్నారు. అయితే ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల అప్పు చేసేందుకు ప్లాన్ చేసింది అని అన్నారు. అయితే ఈ అప్పును అంతా ఎలా తీరుస్తారు అంటూ నిలదీశారు. చివరికి ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థతి లో తెలంగాణ రాష్ట్రం ఉంది అని అన్నారు. అయితే ఈ విషయాల గురించి ప్రజలు కూడా ఆలోచించాలి అంటూ సూచించారు.