రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది – భట్టి విక్రమార్క

Tuesday, September 22nd, 2020, 06:31:39 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల వ్యవహారం లో భట్టి విక్రమార్క అధికార పార్టీ తెరాస తీరు ను ఎండగడుతూ తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ లెక్కలు చెబుతోంది అని భట్టి విక్రమార్క మరొకసారి ఆరోపణలు చేశారు.

అయితే అనేక ప్రాంతాల్లో కట్టని ఇళ్లను కూడా కట్టినట్లు గా జాబితాల్లో తప్పుడు లెక్కలు చెబుతున్నారు అంటూ ఆరోపించారు. నాంపల్లి, జూబ్లీ హిల్స్ నియోజక వర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ళకి సంబంధించిన పలు తప్పుడు వివరాల్ని భట్టి విక్రమార్క నిలదీశారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో 24 నియోజక వర్గాల్లో, ప్రతీ నియోజక వర్గానికి 10 వేల చొప్పున, 2 లక్షల 40 వేల ఇళ్లు కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది అని భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.