హైదరాబాద్ ప్రజలను మోసం చేయడం దుర్మార్గం – భట్టి విక్రమార్క

Saturday, September 19th, 2020, 08:42:33 PM IST


తెలంగాణ రాష్ట్రం లో ఇటీవల భట్టి విక్రమార్క ను తీసుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాల పై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క తాజాగా శనివారం నాడు మీడియా సమావేశం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపించలేక రాష్ట్ర ప్రభుత్వం తోక ముడిచింది అంటూ భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.

లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపిస్తామని చెప్పి, రెండు రోజులు చూపించి మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు అంటూ విమర్శలు చేశారు. అయితే రెండు రోజులలో 3,428 ఇళ్లు మాత్రమే చూపించారు అంటూ మరొకసారి భట్టి విక్రమార్క గుర్తు చేశారు.ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోంది అని, ప్రతి సారి ఎన్నికల సమయం లో శాసన సభ లో తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను తెరాస మోసం చేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ప్రతి నియోజక వర్గానికి నాలుగు వేల ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇంకా కొన్ని చోట్ల పనులనే ప్రారంభించలేదు అని భట్టి విక్రమార్క తెలిపారు. అయితే హైదరాబాద్ ప్రజలను మోసం చేయడం దుర్మార్గం అంటూ భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.