సీఎం కేసీఆర్ కి ఏ మాత్రం రాజ్యాంగ విలువలు ఉన్నా రాజీనామా చేయాలి

Thursday, August 20th, 2020, 03:00:33 AM IST


తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వం పాలన విధానం పై గవర్నర్ తమిలిసై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వానికి గవర్నర్ మంచి సూచనలను చేస్తే అమలు చేయాల్సి ఉంది అని, కానీ కొందరు తెరాస నాయకులు మాత్రం ఎదురు దాడికి దిగడం సరికాదు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క. అయితే గతం లో ప్రభుత్వం పై గవర్నర్ విమర్శలు చేస్తే రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు అని, సీఎం కేసీఆర్ కి ఏ మాత్రం రాజ్యాంగ విలువలు ఉన్నా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క.

అయితే అలా రాజీనామా చేయని పక్షంలో గవర్నర్ ఎత్తి చూపిన తప్పిదాలను సరిదిద్దుకోవాలి అని అన్నారు. గవర్నర్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మాట్లాడటం అభినందన నీయం అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా పెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ ను కోరారు.