రాష్ట్రంలో నమోదు అవుతున్న చావులకు సీఎం కేసీఆరే కారణం

Friday, August 28th, 2020, 02:29:45 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ కేసులతో పాటుగా, వైరస్ సోకి మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఈ కరోనా వైరస్ చావులకు సీఎం కేసీఆరే కారణం అంటూ కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సోకి మృతి చెందిన వారి కుటుంబీకులకు ఎక్స్ గ్రేషియో చెల్లించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. కరోనా వైరస్ మహమ్మారి వైద్య చికిత్స ను ఆరోగ్య శ్రీ లో చేర్పించాలి అని మరొకసారి రాష్ట్రం ప్రభుత్వం ను కోరడం జరిగింది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకల్ను ప్రభుత్వం తీసుకొని పేదలకు వైద్యం అందించేందుకు ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో వైద్యం అందించాలి అని సీఎం కేసీఆర్ ను కోరారు. అయితే ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం కి ఐశోలేషన్, క్వారంటైన్ సెంటర్ లను ఏర్పాటు చేయాలి అంటూ కోరడం జరిగింది. కరోనా పై ముందుగానే హెచ్చరించినా సీఎం కేసీఆర్ పెడచెవిన పెట్టారు అని విమర్శించారు. తెలంగాణ లో ప్రజా పాలన లేదు అని, పోలీస్ రాజ్యం కొనసాగుతుంది అని అన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు అని ఆరోపించారు. అంతేకాక మిగులు బడ్జెట్ అంశం పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం నిర్లక్ష ధోరణి వోదిలిపెట్టి, ప్రజా ఆరోగ్యానికి నిధులు కేటాయించాలి అని డిమాండ్ చేశారు.