ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్ట్ కిట్లు లేవు – భట్టి విక్రమార్క

Wednesday, August 12th, 2020, 12:14:30 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి నివారణకు క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు అని కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ ను అరికట్టడం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై మీడియా ఎదుట పలు కీలక వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క.

వైద్య శాఖలో ఉన్నటువంటి లోపాలు బయటపడతాయన్న భయం తో నే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పై సమీక్ష నిర్వహించ డం లేదు అని ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్ట్ కిట్లు లేవు అని, లక్షా 82 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రాష్ట్రం లో అసలు వైద్యం గురించి పట్టించుకోవడం లేదు అని వరుస విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలో వైద్య శాఖ కి సరిపడా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అని సూచించారు. అంతేకాక ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం చికిత్స రేట్లను ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.