బిగ్ న్యూస్: రైతుల భారత్ బంద్ కు విస్తృతంగా మద్దతు

Tuesday, December 8th, 2020, 11:01:25 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులని రద్దు చేయాలి అంటూ రైతులు దేశ రాజధాని లో 13 రోజులుగా నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం పట్ల వెనకడుగు వేయకపోవడం తో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిసెంబర్ 8 న భారత్ బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రైతుల ప్రకటించిన ఈ భారత్ బంద్ కి విస్తృత స్థాయిలో మద్దతు లభిస్తోంది. దేశంలోని 20 రాజకీయ పార్టీల వరకు రైతులకు మద్దతు ఇస్తుండగా, వీరితో పాటు ఉద్యోగ కార్మిక సంఘాలు బంద్ లో పాల్గొన్నాయి. అయితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ బంద్ ప్రభావం తక్కువగా ఉండగా, మిగతా రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఢిల్లీ లో ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల రైల్ రోకో చేపట్టారు రైతులు. అయితే భారత్ బంద్ కోసం రైతులు రోడ్లు పై బైటైంచడం తో పలు చోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారి, 144 సెక్షన్ విధించడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ తన పుట్టిన రోజు కి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9 న తన పుట్టిన రోజు కాగా, ఎటువంటి వేడుకలు చేసుకోవడం లేదు అని కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రైతుల భారత్ బంద్ కి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటు తెరాస ప్రభుత్వం సైతం రైతుల నిరసన కి మద్దతు తెలుపుతూ, పలువురు నేతలు ఈ బంద్ లో పాల్గొననున్నారు.