రైతు సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ బంద్… ఏపీ సంపూర్ణ మద్దతు

Friday, March 26th, 2021, 08:48:48 AM IST

రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు బంద్ కి పిలుపు ఇచ్చారు. అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సంపూర్ణ మద్దతు లభిస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కి వ్యతిరేకం గా బంద్ కొనసాగుతోంది. అయితే రైతుల భారత్ బంద్ కొరకు దేశ వ్యాప్తంగా సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ కొనసాగుతోంది. తెలుగు దేశం పార్టీ, వైసీపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు మద్దతు తెలిపాయి.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దు లో గత నాలుగు నెలలు గా ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే ఏపీ లో మాత్రం సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి బస్సులు డిపో లకే పరిమితం అయ్యాయి. ఆర్టీసి బస్సు రవాణా లేకపోవడం తో డిపో లు అన్నీ కూడా నిర్మానుష్యం గా తయారు అయ్యాయి. అయితే వైజాగ్ లో మాత్రం ప్రజా సంఘాలు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్నారు. పలు చోట్ల డిపో ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు.