కరోనా వ్యాక్సిన్‌ పంపీణీపై కేంద్రం కీలక నిర్ణయం..!

Thursday, December 10th, 2020, 02:00:51 AM IST

ఏడాదికాలంగా ప్రపంచ దేశాలన్నిటిని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని అందరూ కళ్ళు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం నిరాకరించింది. కరోనా వ్యాక్సిన్‌‌ను తయారుచేసిన సీరమ్‌, భారత్ బయోటెక్‌ సంస్థలు అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలంటూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి.

అయితే సీరమ్‌, భారత్ బయోటెక్‌ దరఖాస్తులను కేంద్రం తిరస్కరించింది. వ్యాక్సిన్ భద్రత, సామర్ధ్యంపై సరైన డేటా లేదన్న కేంద్రం, నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇటీవల భారత ప్రధాని మోదీ ఈ రెండు వ్యాక్సిన్ల పురోగతి గురుంచి తెలుసుకున్న సంగతి తెలిసిందే.