ఎన్ని కుటిల రాజకీయాలు చేసిన మరో 15 ఏళ్లు సీఎం జగనే

Tuesday, January 5th, 2021, 06:34:40 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రముఖ నటుడు బానుచందర్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాక తెలుగు దేశం పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్ష నేత గా చంద్రబాబు నాయుడు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం నీచం అంటూ బాను చందర్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల రాజకీయం దారుణం అంటూ విమర్శించారు.

అయితే చంద్రబాబు నాయుడు నైజం గురించి ఎన్టిఆర్ ఆనాడే స్పష్టంగా చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన నాతో చెప్పిన మాటలు చెప్తే చంద్రబాబు కి పుట్టగతులు ఉండవ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గర కావడం చంద్రబాబు నాయుడు సహించలేక పోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అందుకే ఈ కుట్ర పూరిత రాజకీయాలు అని, అయితే వీళ్ళు ఎన్ని కుటిల పూరిత రాజకీయాలు చేసినా మరో 15 ఏళ్లు సీఎం గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉంటారు అని అన్నారు.