బంగారంలాంటి భారత్ ను బీజేపీ నాశనం చేసింది – మమతా బెనర్జీ

Friday, February 5th, 2021, 04:36:44 PM IST

ఈ సారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో బెంగాల్ పై వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించి, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో వరాల జల్లు కురిపించింది. అయితే త్వరలో బెంగాల్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కి, బీజేపీ కి మధ్యలో మాటల యుద్దాలు నడుస్తున్నాయి. అయితే ఈ మేరకు ఒక సభ లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం లాంటి భారత దేశాన్ని నాశనం చేసి, ఇప్పుడు బెంగాల్ ను బంగారం చేస్తానని వాగ్దానాలు చేస్తోంది అంటూ సెటైర్స్ వేశారు. అయితే రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం లేదు అని, ఆ స్థానాన్ని మరే పార్టీ భర్తీ చేయలేదు అంటూ మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.

అయితే అటు మమతా బెనర్జీ ప్రభుత్వం పై బీజేపీ వరుస విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, అభివృద్ధి శూన్యం అని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే బీజేపీ దేశాన్ని అమ్మకానికి పెట్టింది అని, తృణమూల్ కాంగ్రెస్ ప్రపంచం లోనే అత్యుత్తమ పాలన అందిస్తోంది అని, బీజేపీ వర్గాలు తిరుగుబాటు దారులు అని, బెంగాల్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకొనే ముందు అద్దం లో తమను తాము చూసుకోవాలి అంటూ బీజేపీ నేతల పై వరుస విమర్శలు చేశారు మమతా బెనర్జీ. అయితే ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో మాటల యుద్దాలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.