ప్రభాస్ పుట్టిన రోజున “బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్”

Saturday, October 17th, 2020, 07:02:05 PM IST

ప్రభాస్, పూజ హెగ్డే లు హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం తో అభిమానులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అందరి ఎదురు చూపులకి ప్రభాస్ ఒక ముగింపు ఇవ్వనున్నారు. ఇప్పటికే రాధే శ్యామ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్, పోస్టర్ విడుదల కాగా, ఇటీవల పూజ హెగ్డే ఫస్ట్ లుక్ సైతం విడుదల అయింది. అయితే ఇప్పుడు సరికొత్త మ్యూజికల్ మరియు ఐ ఫీస్ట్ ఇచ్చేందుక సిద్దం అయ్యారు చిత్ర యూనిట్.

బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అంటూ ప్రభాస్ తాజాగా ఒక ప్రకటన చేశారు. అయితే ప్రభాస్ పుట్టిన రోజున ఇది విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. మరి కొందరు మాత్రం లవ్ బీట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజున ఈసారి అభిమానులకు డబుల్ ధమాకా మాత్రం పక్కా అని తెలుస్తోంది.