ఈ రోజు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు…కేసీఆర్ పై ప్రశంసలు

Wednesday, March 25th, 2020, 10:40:47 PM IST

తెలంగాణ రాష్ట్రం లో ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించారు.

మీ పరిపాలన అద్భుతం మీరు పోషిస్తున్న తెలంగాణ తండ్రి పాత్ర అమోఘం అని వ్యాఖ్యానించారు. ఈరోజు మీరు భారతదేశంలో లో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం పొందారు అని బండ్ల గణేష్ అన్నారు. దమ్ము ధైర్యం నీతి నిజాయితీ క్రమశిక్షణగల ముఖ్యమంత్రిగా మీరు అనితర సాధ్యం అని అన్నారు.మీరు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో ప్రజా ప్రతినిధులను ప్రేమతో మందలించిన తీరు అద్భుతం సార్ అంటూ అభినందించారు. మీ మీద అ ప్రేమ గౌరవం అభిమానం వెలకట్టలేని విధంగా మా హృదయాల్లో ఉన్నారు సార్, మీరు తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా బంగారు తెలంగాణ సాధించారు జై కేసీఆర్ వందేళ్లు చల్లగా చక్కగా బ్రతకాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను అని బండ్ల గణేష్ అన్నారు.

అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. తండ్రి అంటే భయం గురువు అంటే భక్తి మీరంటే భయం తో కూడిన భక్తితో కూడిన ప్రేమ సార్ తెలంగాణ ప్రజలకి జై కేసీఆర్ అంటూ నినదించారు.