రెండో సారి కరోనా బారిన పడ్డ నిర్మాత బండ్ల గణేశ్..!

Tuesday, April 13th, 2021, 04:20:36 PM IST

కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంది. సామాన్యులతో పాటు ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు, సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే ఒకసారి కరోనా వచ్చిన తర్వాత రెండోసారి రావడం చాలా అరుదు అని వైద్యులు చెప్తున్నారు. తాజాగా బండ్ల గణేష్‌కు మరోసారి కరోనా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది టాలీవుడ్‌లో అందరికంటే ముందుగానే నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్‌కు కరోనా వచ్చి నయ్యమైన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన బండ్ల గణేష్‌కు తీవ్ర జ్వరం రావడం, ఎంతకీ తగ్గకపోవడంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌కు వెళ్లి జాయిన్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం నిలకడగానే ఉందని సన్నిహితులు చెప్తున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చాలా మందికి కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఇప్పటికే నిర్మాత దిల్ రాజుకు కరోనా సోకగా, పవన్ కళ్యాణ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు.