అన్నా అంటే చాలు.. నేనున్నానంటున్న బండ్ల గణేశ్..!

Saturday, August 15th, 2020, 12:17:34 AM IST


ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. మామూలుగానే సేవా దృక్పదం కలిగి ఉన్న బండ్ల గణేశ్ కరోనా సమయంలో మరింత మారిపోయాడు. ఎవరైనా ఆపదలో ఉండి అన్నా అంటే చాలు.. నేనున్నానంటూ తనకు తోచిన సాయం చేస్తూ ఆదుకుంటున్నాడు.

అయితే తాజాగా మణికాంత్ అనే ఓ కుర్రాడు అన్నా మా నాన్న ఆటో డ్రైవర్, కరోనా కారణంగా ఇంట్లో ఫైనాన్సియల్‌గా ఇబ్బంది ఏర్పడింది, నాకు డబ్బులొద్దు నేను ఇంటర్ చదివాను నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అన్నా అని ట్విట్టర్ ద్వారా ప్రాధేయపడ్డాడు. దీంతో వెంటనే స్పందించిన బండ్ల గణేశ్ ఓ కంపెనీ పేరు, ఫోన్ నంబర్ చెప్పి తన పేరు చెప్పు ఉద్యోగం ఇస్తారు అని చెప్పి ఆ కుర్రాడికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. ఏదేమైనా బండ్ల గణేశ్ చేస్తున్న సాయానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.