సీఎం కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారా.. బండి సంజయ్ సూటి ప్రశ్న..!

Tuesday, May 18th, 2021, 12:11:23 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూటి ప్రశ్న వేశారు. సీఎం కేసీఆర్ అసలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా అని ప్రశ్నించారు. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకుంటే కనీసం ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలని అన్నారు. 20 కోట్ల వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందని, తెలంగాణకు కూడా 6.14 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చిందని మరో 3 రోజుల్లో 3 లక్షల డోసులు రాష్ట్రానికి రాబోతున్నాయని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

అయితే కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాల సాయం చేస్తుందని, అసలు కేంద్రాన్ని విమర్శించే అర్హత లేదని అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారని ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయకపోవడానికి కారణమేంటని కూడా బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు.