మీరు లెక్కలు తీస్తారా.. కేంద్రానికి ఫిర్యాదు చేసి తీయించాలా – బండి సంజయ్

Tuesday, March 16th, 2021, 05:32:39 PM IST

సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరోస్ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రోద్భలంతోనే హిందు మనోభావాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

అయితే అసలు స్వేరోస్ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని లేదంటే కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడినుంచి లెక్కలు తీయిస్తామని హెచ్చరించారు. హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏమి చేస్తుందని, చాలా ఏళ్ళ నుంచి ఈ కుట్ర జరుగుతోందని బండి సంజయ్ అన్నారు.