అక్రమ అరెస్టులకు భయపడేది లేదు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..!

Thursday, February 4th, 2021, 01:15:29 AM IST


టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతేసేలా రామయ్యను కించపరిచిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలేదంటేనే సీఎం కేసీఆర్‌కు హిందుత్వంపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని అన్నారు. అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణానికి సంబంధించిన విరాళాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు.

అయితే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నేతలు దాడులకు పాల్పడ్డారని అక్రమ కేసులు పెట్టి పోలీసులు అరెస్టులు చేశారని, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ కార్యాలయంపై దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలను ఎందుకు అరెస్టులు చేయలేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. అరెస్ట్‌లతో రాష్ట్రాన్ని నడపాలనుకుంటే పశ్చిమబెంగాల్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసని, అక్రమ అరెస్ట్‌లకు బీజేపీ కార్యకర్తలు బెదిరే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు.