నీ ఏడుపు నువ్వు ఏడువు.. కేటీఆర్‌కు చురకలు అంటించిన బండి సంజయ్..!

Friday, March 12th, 2021, 05:50:46 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నీ ఏడుపు ఏదో నువ్వు ఏడువు అని కేటీఆర్‌కి చురకలు అంటించారు. అంతేకాదు కేటీఆర్ నిజంగా పోటుగాడైతే అజంజాహీ మిల్స్, నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని సవాల్ విసిరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడేందుకు అక్కడ చాలా మంది ఉన్నారని అన్నారు.

ఇదిలా ఉంటే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతుందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఓడిపోతున్నామని తెలిసే ఓటర్లను సీఎం కేసీఆర్‌ ఓటు వేయమని అడగడంలేదని, అహంకారంతో వ్యవహరించే సీఎంకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఓడిపోతున్నామని తెలిసే ఉద్యోగ సంఘాలను పిలిపించి మాట్లాడారని, నిజంగా కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పీఆర్సీపై ఎన్నికల కమిషన్ అనుమతి ఎందుకు తీసుకోలేదని అన్నారు. పీఆర్సీ ఇస్తామంటే తామేమి వ్యతిరేకించమని బండి సంజయ్ స్పష్టం చేశారు.