కేసీఆర్ ఎక్కడ ఉన్నారో.. ఎక్కడ పన్నారో తెలియట్లేదు – బండి సంజయ్

Wednesday, December 23rd, 2020, 06:31:30 PM IST

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. దివంగత మాజీ ప్రధాని పీవీ వర్థంతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ రాకపోవడం పీవీనీ నిజంగా అవమానించడమే అని అన్నారు. అయితే గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే కేసీఆర్ పీవీ జయంతి ఉత్సవాలు జరిపారు తప్పా ఆయన మీద ప్రేమతో కాదని చెప్పుకొచ్చారు. పీవీ హోర్డింగులు పెట్టి డబ్బులు కాజేశారని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు అయిపోవడంతో కనీసం బయటకి కూడా రావడం లేదని, అసలు సీఎం కేసీఆర్ ఎక్కడ ఉన్నారో.. ఎక్కడ పన్నారో ఎవరికీ తెలియట్లేదని విమర్శించారు. ఇలాంటి సీఎం అసలు దేశంలో ఎక్కడా లేరని రాష్ట్రాన్ని, గెలిపించిన ప్రజలను గాలికొదిలేసి ఇంట్లో కూర్చున్నారని అన్నారు.