జీహెచ్ఎంసీ ఎన్నికలలో కేసీఆర్ బాక్స్ బద్దలు కొడుతాం – బండి సంజయ్

Wednesday, November 11th, 2020, 11:46:01 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశాడు. నిజామాబాద్‌లో కేసీఆర్ బిడ్డను, దుబ్బాకలో అల్లుడిని ఓడగొట్టామని రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో కేసీఆర్ బాక్స్ బద్దలుకొడతామని అన్నారు. పేదల జోలికొస్తే ఎలాగుంటుందో దుబ్బాక ప్రజలు కేసీఆర్‌కు రుచి చూపించారని అన్నారు. కేసీఆర్‌కు నిజంగానే బీసీలపై ప్రేముంటే టీఆర్ఎస్‌ అధ్యక్ష పదవి ఇవ్వాలని అన్నారు.

బీసీలను అణగదొక్కుతూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతమున్న ఉన్న మంత్రులంతా నామమాత్రమే అని, వారంతా కేసీఆర్ చెంచాగాళ్లని, అసలు ఆ బతుకు ఎందుకు బతుకుతున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం పదవి కాపాడుకోవడానికి తన కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు ఎక్కడలేని యాగాలన్ని చేస్తున్నారని అన్నారు. హిందూగాళ్లు బొందూగాళ్లు అంటేనే టీఆర్ఎస్‌ను ప్రజలు బొందపెట్టారని, హిందువులను చీల్చాలని చూస్తే కేసీఆర్ అంతు చూస్తామని హెచ్చరించారు.