కేసీఆర్ ఓ పాస్‌పోర్ట్ బ్రోకర్.. ఎంపీ బండి సంజయ్ సీరియస్ కామెంట్స్..!

Friday, October 30th, 2020, 03:00:08 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ సీరియస్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ ఓ పాస్‌పోర్ట్‌ల బ్రోకర్‌ అని మండిపడ్డారు. కులాలను అడ్డుపెట్టుకొని మంత్రి పదవి పొందారని, నిరుద్యోగులను నిండా ముంచి కోట్లు సంపాదించారని అన్నారు. ఇలాంటి నీచమైన అవినీతిపరుడైన సీఎంను ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

అంతేకాకుండా బీసీలను కూడా సీఎం కేసీఆర్ నట్టేట ముంచారని, ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు కూడా ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడని దానిని బీజేపీ అడ్డుకుందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. కొండగట్టు బస్సు ప్రమాదంపై కేసీఆర్‌ మాట్లాడలేదని, హైదరాబాద్‌లో భారీ వర్షాలకు ఇళ్లు నీటమునిగితే కేసీఆర్‌ మాత్రం ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. కేంద్రానికి వ్యవసాయ పంపుసెట్ల వద్ద మీటర్లు పెట్టే యోచనలేదని చెప్పుకొచ్చారు.