సీఎం కేసీఆర్ గల్లా పట్టుకొని ప్రశ్నిస్తాం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..!

Monday, March 15th, 2021, 06:32:36 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి నిప్పిలు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికే కొమ్ము కాసేలా వ్యవహరిస్తూ హిందువులని హింసిస్తుందని అన్నారు. బైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ ప్రభుత్వం పోలీసులను ఎంఐఎం చెప్పు చేతల్లో పెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని బండి సంజయ్‌ చెప్పుకొచ్చారు

అయితే మహారాష్ట్ర నుండి బహిష్కరించిన కొందరు లుచ్చాలు బైంసాలో అల్లర్లు సృష్టిస్తున్నారని అన్నారు. పొడిచింది హిందువులనే అని, ఆస్తుల ధ్వంసం అయ్యింది హిందువులవే అని, అరెస్ట్ చేసింది హిందువులనే అని ఒక వైపు ప్రభుత్వం, మరోవైపు దుర్మార్గులు కలిసి హిందు కుటుంబాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక పసిపాప మీద అత్యాచారం జరిగితే సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని అన్నారు. త్వరలోనే ప్రగతిభవన్‌లోకి చొరబడి సీఎం గల్లా పట్టుకొని ప్రశ్నిస్తామని బండి సంజయ్ అన్నారు.