తెలంగాణలో రాక్షస రాజ్యం పోయి రామ రాజ్యం రావాలి – బండి సంజయ్

Tuesday, March 9th, 2021, 12:10:10 AM IST


తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. నేడు భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న బండి సంజయ్ తెలంగాణలో రాక్షస రాజ్యం పోయి రామ రాజ్యం రావాలని భద్రాద్రి రామయ్యను కోరినట్టు తెలిపారు. గత ఆరేళ్లుగా రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని ఆరోపణలు చేశారు. అంతేకాదు కేసీఆర్ కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలు అందుతున్నాయని అన్నారు.

అయితే రాష్ట్రంలో దేవాలయాల మీద వస్తున్న ఆదాయాలు ఎటుపోతున్నాయో, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఫైర్‌ అయ్యారు. అయితే దేశంలో షెడ్యూల్ ఇవ్వని ముఖ్యమంత్రి ఉన్నడని అంటే అది కేసీఆర్ ఒక్కడేనని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రామాయణ సర్క్యూట్ లోని 500 కోట్ల ప్యాకేజీలో 30 కోట్లు భద్రాద్రి అభివృద్ధి కోసం ఇస్తామని చెప్పినా డ్ఫృ ఇవ్వకుండా కేసీఆర్ తప్పించుకుంటున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు.