సీఎం కేసీఆర్ తప్పును బయటపెడతా.. బండి సంజయ్ సంచలన ప్రకటన..!

Friday, February 26th, 2021, 07:30:08 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సరికొత్త బాంబు పేల్చారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు ఓ పెద్ద తప్పు చేశారని, ఆయన పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని తన దగ్గర ఆధారాలున్నాయని అన్నారు. అయితే లోక్‌సభ స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నానని, ఒకవేళ స్పీకర్ పర్మిషన్ ఇస్తే పార్లమెంట్ సాక్షిగా కేసీఆర్ బండారం బయటపెడతానని చెప్పుకొచ్చారు. అయితే ఆ అంశం ఖచ్చితంగా పార్లమెంటును కుదిపేస్తుందని అన్నారు.

ఇదిలాఉంటే నేడు బండి సంజయ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ బీజేపీలో చేరారు. అయితే టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసమే పీవీని వాడుకుంటున్నారని, పీవీ ఘాట్‌ను ఎంఐఎం కూల్చుతామంటే కేసీఆర్ కనీసం స్పందించలేదని అన్నారు. మోసం చేయటంలో కేసీఆర్ ఏక్ నంబర్.. కేటీఆర్ దస్ నంబర్ అని ఎద్దేవా చేశారు. న్యాయవాది వామనరావు హత్యపై సీబీఐ విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేసి పొరపాటు చేయొద్దని బండి సంజయ్ అన్నారు.