పన్నులన్నీ హిందువులు కడితే పాతబస్తీ లో జల్సా చేస్తారా?

Sunday, November 29th, 2020, 05:37:34 PM IST

Bandi-Sanjay

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ బేగంపేట్ లో వైద్యులతో సమావేశం అయ్యారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో హిందువులు భయానక వాతావరణం లో జీవిస్తున్నారు అని అన్నారు. పాతబస్తీ ను భాగ్యనగరం గా మార్చాలి అని బీజేపీ కోరుకుంటుంది అని అన్నారు. పాతబస్తీ లో హిందూ జనాభా ను తగ్గించేందుకు కుట్ర జరుగుతోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిస్తే రొహింగ్యాలు, పాక్ వాసులను తరిమి కొడతాం అని అన్నారు. అయితే పాతబస్తీ లో ఎందుకు అభివృద్ది జరగడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం ను బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. పాతబస్తీలో ఏడాదికి 600 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు అని బండి సంజయ్ అన్నారు. అయితే పన్నులన్ని హిందువులే కడితే పాతబస్తీ లో జల్సాలు చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. గ్రేటర్ లో హైదరాబాద్ కి అవకాశం ఇవ్వాలి అని, ఎన్నో మహ నగరాలను బీజేపీ అభివృద్ది చేసింది అని, హైదరాబాద్ ను కూడా మహ నగరం గా అభివృద్ది చేస్తామని బండి సంజయ్ వైద్యులతో తెలిపారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి హాట్ టాపిక్ గా మారాయి.